చిరంజీవి `భోళా శంకర్`కి ముహూర్తం ఫిక్స్…

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం భోళా శంక‌ర్‌. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా మాస్ అండ్‌ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. నవంబర్ 11న ఉదయం 7 45 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

అన్నాచెల్లెళ్ల బంధం చుట్టు తిరిగే ఈ కథలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు.

మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు. భోళా శంకర్ 2022లో విడుదల కానుంది.

సిఫార్సు చేసిన పోస్ట్లు

There are no reviews yet. Be the first one to write one.

0.0
Rated 0 out of 5
0 out of 5 stars (based on 0 reviews)
Excellent0%
Very good0%
Average0%
Poor0%
Terrible0%